Home Page SliderNational

గోదావరికి భారీగా పోటెత్తిన వరద

భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద పోటెత్తింది. గోదావరి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. పోలవరం, భద్రాచలం వద్ద వరదనీరు పోటెత్తింది. తెలంగాణలో భద్రాచలం వద్ద భారీగా వరద వస్తోంది. స్నానఘట్టాలన్నీ నీటమునిగాయి. ఇప్పటికే నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 18 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. కడె ప్రాజెక్టు సైతం భారీ వరద ముంచెత్తుతోంది.  ధవళేశ్వరం నుండి 8 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నుండి కూడా వరదనీరు ప్రవహిస్తోంది.