Andhra PradeshHome Page Slider

అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై వాడిగా,వేడిగా వాదనలు

అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల లాయర్లు హాట్ హాట్‌గా వాదనలు కొనసాగిస్తున్నారు. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణలో అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భాస్కరరెడ్డి కస్టడీతో పాటు అవినాశ్‌రెడ్డిని కూడా నిందితునిగా పేర్కొంది సీబీఐ. ఈరోజు 4 గంటలకు అవినాశ్‌రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరుకావలసి ఉంది. కానీ కేసు వాదనలు ఇంకా కొనసాగుతున్నందున రేపు ఉదయం 10.30 హాజరుకమ్మని సీబీఐ తెలియజేసింది. వివేకా హత్యకు భూ తగాదాలు, ఆస్తి తగాదాలు, రాజకీయ కారణాలు కారణమై ఉండొచ్చని అవినాశ్ తరపు లాయర్ వాదించారు. అవినాశ్ విచారణకు సహకరించలేదని, అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యొద్దని సీబీఐ తరపు లాయర్లు వాదించారు. ఈ హత్యకు 40 కోట్లు సుపారీ ఇచ్చారని, కేసంతా కూడా భాస్కరరెడ్డి, అవినాశ్‌రెడ్డిల చుట్టూనే తిరుగుతున్నాయని లాయర్లు వాదిస్తున్నారు. సీబీఐ కేవలం దస్తగిరి వాగ్మూలం ఆధారంగానే సాగుతోందని పారదర్శకత లేదని పేర్కొన్నారు. గూగుల్ టేకౌట్ ఆధారంగా అవినాశ్‌రెడ్డి, వివేకా హత్య సమయంలో ఇంట్లోనే ఉన్నారని, తన ఫోన్‌ను అసహజంగా వాడారని సీబీఐ ఆరోపించింది.