Andhra PradeshHome Page Slider

స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు

Share with

ఏపీ: అన్ని ప్రభుత్వ స్కూళ్లలో క్రమం తప్పకుండా వాటర్ బెల్ కార్యక్రమం కొనసాగించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ నివారణకు రోజుకు 3 సార్లు వాటర్ బెల్ నిర్వహించి వారందరూ వాటర్ తాగేలా చూడాలని టీచర్లకు విద్యాశాఖ వారు తెలియజేశారు. ఏప్రిల్ 23 వరకు ప్రతి రోజూ డీఈఓ లు దీన్ని పర్యవేక్షించాలి. మూత్రం రంగును బట్టి శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు గుర్తించేలా అవగాహన కల్పించాలి. ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు వాటర్ బెల్ మోగించాలి అని పేర్కొంది.