ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ అడుగుపెడుతుందా?
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో, ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకునే దిశగా టీమిండియా శనివారం ఒక అడుగు ముందుకు వేసింది. మొదటి, రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వరుసగా ఐదు వికెట్లు సాధించారు. మ్యాచ్‌ను భారత్ మూడు రోజులలో ముగించింది. ఈ విజయంతో, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. WTC పాయింట్ల పట్టికలో పాయింట్లను మెరుగుపరుచుకుంది. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై భారత్ భారీ విజయం సాధించిన తర్వాత ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ర్యాంక్ మెరుగయ్యింది. తొలి టెస్టులో 58.93 శాతం సాధించిన భారత్ ప్రస్తుతం పట్టికలో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది. భారతదేశం ఇప్పుడు 61.67 శాతం కలిగి పట్టికలో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది. అయితే ఆస్ట్రేలియా WTC ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోడానికి తర్వాత మ్యాచ్‌ను కనీసం డ్రా చేయాల్సి ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా విజయ శాతం 75.56 శాతం నుండి 70.83కి తగ్గింది. గతంలో WTC నుండి రన్నరప్‌గా ఉన్న భారత్, తమ స్థానాన్ని కన్ఫామ్ చేసుకోవాలంటే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని గెలవాల్సి ఉంది. ప్రస్తుత సీజన్ జూలై 2021- జూన్ 2023 వరకు నడుస్తుంది. మొదటి తొమ్మిది టెస్ట్ జట్లు ఒక్కొక్కటి ఆరు సిరీస్‌లను ఆడతాయి. మూడు స్వదేశంలో, మూడు బయట. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి.
