Home Page SliderInternationalNewsNews AlertPolitics

పాక్‌పై భారీ ఆపరేషన్..మాక్‌డ్రిల్ ఎందుకంటే..

పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ పాకిస్తాన్‌పై దాడికి రంగం సిద్ధం చేసిందంటూ సంచలన ట్వీట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే భారత్ పెద్దఎత్తున మాక్‌డ్రిల్‌కు ఏర్పాట్లు చేసింది. భారతదేశవ్యాప్తంగా రేపు 259 ప్రాంతాలలో ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించనున్నారు. ఈ డ్రిల్స్‌కు సంబంధించిన వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సివిల్ డిఫెన్స్ చీఫ్స్ సర్వం సిద్ధం చేశారు. ఏపీలో విశాఖలో, తెలంగాణలో హైదరాబాద్‌లో కూడా ఈ డ్రిల్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ అధికారి ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 1971లో భారత్- పాక్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి డ్రిల్స్ జరిగాయని ఆయన పేర్కొన్నాడు. రష్యా విక్టరీ డే తర్వాత మే 10,11 తేదీలలో ఈ దాడులు జరగవచ్చని ఆయన సూచించాడు. మాక్ డ్రిల్స్‌లో భాగంగా ప్రజలను యుద్ధ సన్నద్దతను సరిచూసుకునేందుకు పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. వాయుదాడుల సైరన్లు, ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి, పౌర రక్షణకు యువతకు శిక్షణనివ్వడం, ఉగ్రదాడులు ఎదురైతే దీటుగా ఎదుర్కోవడం వంటివి నేర్పిస్తారు. ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. 1971 తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్ ఇదే తొలిసారి.