Home Page SliderNational

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

Share with

ఈ కొత్త సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్.అదేంటంటే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా “దేవర”.కాగా ఈ సినిమా నుంచి  ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. దేవర మూవీ గ్లింప్స్‌ను ఈ నెల 8వ తేదిన రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను ఇవాళ విడుదల  చేశారు.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్,శ్రీకాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.అయితే ఈ సినిమా ఇప్పటివరకు 80%  వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.