సమైక్య సత్తా…కామన్ గేమ్స్ విజేత భారత్
కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా అదరగొట్టింది. మొత్తం గేమ్స్ లో భారత్ 22 గోల్డ్‌తో సహా 61 మెడల్స్ సాధించింది. చివరి రోజు స్టార్ షెట్లర్ పీవీ సింధు గోల్డ్ గెలుచుకొని చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో సింథు తొలిసారిగా గోల్డ్ గెలుచుకున్నారు. పతకాల పట్టీలో భారత్ ఈసారి నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాత స్థానంలో ఇండియా నిలిచింది. ఆస్ట్రేలియా 67 స్వర్ణాలతో మొత్తం 178 పతకాలు గెలుచుకుంది. ఇంగ్లాండ్ 57 స్వర్ణాలతో 176 పతకాలు నెగ్గింది. కెనడా 26 స్వర్ణాలతో 92 పతకాలు సాధించింది. ఇండియా ఈసారి షూటింగ్ లేకున్నా అద్భుతమైన ప్రదర్శన చేసింది. 2018లో వరకు ఇండియా ఎక్కువగా షూటింగ్ పైనే ఆధారపడింది. ఇండియా గెలుచుకున్న పతకాలు ఎక్కువ శాతం షూటింగ్ నుంచే వచ్చేవి.