NewsNews Alert

కాసేపట్లో మహా కేబినెట్ విస్తరణ…

ఆగస్టు 9న మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జూన్‌ 30న ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా… ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఇద్దరితోనే కేబినెట్‌ కొనసాగుతోంది. దీనిపై విపక్షాలు విమర్శల వర్షం కురిపించడంతో కేబినెట్‌ను విస్తరించాలని సీఎం షిండే నిర్ణయించినట్లు సమాచారం.  మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రులుగా 15 మంది ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఫడ్నవీస్‌కు హోం మంత్రి శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పలువురు మాజీ మంత్రులకు మళ్లీ కేబినెట్‌ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది.