NewsTelangana

మునుగోడు ఖాళీ … ఏ క్షణమైన ఎన్నికలు

Share with

మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం… ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయ్. గతంలో ఈటల రాజీనామా చేసిన వెంటనే ఏవిధంగానైతే ఆమోదించారో… ఈసారి కూడా స్పీకర్ అదే విధంగా వ్యవహరించారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీ అయ్యిందంటూ అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల చేయడం… ఇదే విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్… సీఈవోకు సమాచారం అందించడం చకచక జరిగిపోయాయ్. ఇక మునుగోడులో అమీతుమీ తేల్చుకునేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఎన్నిక తెలంగాణ అతి కాస్ట్లీ ఎన్నికవుతుందా.. లేదంటే సాదాసీదాగా జరుగుతుందా అన్నది చూడాలి… ఉపఎన్నికల కోసం ఎదురు చూస్తున్న బీజేపీ… మునుగోడు ఎన్నికను వీలైనంత త్వరగా చేస్తుందా… లేదంటే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తో కలిపి నిర్వహిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.