కామన్ వెల్త్‌లో భారత్ భళా
సోమవారంతో కామన్‌వెల్త్ గేమ్స్ ముగియనుండటంతో ఆదివారం భారత్ ఆటగాళ్లు దుమ్మురేపారు. క్రీడల్లో అత్యధిక పతకాలతో మేటి ఆటగాళ్లను మట్టికరిపించారు. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 55 పతకాలు సాధించి అబ్బురపరుస్తోంది. పోటీల్లో ఇప్పటి వరకు 18 స్వర్ణాలు, 15 రజితం, 22 కాంస్య పతకాలను భారత ఆటగాళ్లు సాధించారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాల పంట పండింది. ఒకే రోజు 5 స్వర్ణాలను గెలుచుకొని సత్తా చాటింది టీం ఇండియా.
తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ మహిళల 50 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. దేశానికి పతకాలు అందించడమే తన లక్ష్యమంటూ బర్మింగ్‌హోమ్‌లో మువ్వన్నెల జెండా ఎగురేసింది. అటు కుస్తీ, ఇటు బాక్సింగ్ పోటీల్లో భారత్ ఔరా అన్పిస్తోంది. ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్, అమిత్ ఫంగాల్, నీతూ గంగాస్‌లకు స్వర్ణ దక్కింది. ఇక ట్రిపుల్ జంప్‌లో భారత ఆటగాళ్లు ఎల్దోస్ పాల్, అబ్దుల్లా అబుబాకర్ స్వర్ణం, రజితం రెండు పతకాలను గెలుచుకున్నారు.
మెన్స్ ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబాకర్ అద్బుతమైన ప్రదర్శనతో సిల్వర్ పతకాన్ని గెలుచుకొని భారత్ ఆటగాళ్ల సత్తా ఏంటో చూపించాడు.
తెలుగు ఆణిముత్యం శ్రీకాంత్ కిదాబి థామస్ కప్ విక్టరీ తర్వాత కామన్ వెల్త్ గేమ్స్‌లోనూ సత్తా చాటారు. బ్రాంజ్ పతకాన్ని గెలుచుకున్నారు.
టేబుల్ టెన్నిస్‌లో భారత్ ఆటగాళ్లు శ్రీజ, శరత్ స్వర్ణం సాధించారు.
ఇక కామన్ వెల్త్ గేమ్స్‌లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన క్రికెట్ సీరిస్ లో భారత్ ఫైనల్లో ఓడింది. అయినప్పటికీ రజతపతకాన్ని కైవశం చేసకొంది. ఆస్ట్రేలియాపై ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఇండియా 9 పరుగుల తేడాతో ఓడింది.
ఇక వెస్టిండీస్ లో జరుగుతున్న టీ 20 సీరిస్ లో భారత్ భళా అన్పించింది. సీరిస్‌ను 4-1 తేడాతో గెలుపొంది రోహిత్ సేన కరేబియన్ దీవుల్లోనూ భారత్‌కు తిరుగులేదనిపించింది. ఇక వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఇకపై అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.