NationalNews

కామన్ వెల్త్ గేమ్స్ లో మీరా చానుకు గోల్డ్

Share with

కామన్ వెల్త్ గేమ్స్‌లో ఇండియా ఇప్పటి వరకు నాలుగు పతకాలు గెలుచుకొంది. ఒలింపిక్ మెడల్ విజేత మీరా భాయ్ చాను 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకోగా… మరో రెండు సిల్వర్ మెడల్స్ తోపాటు, ఒక బ్రాంజ్ పతకాన్ని భారత ఆటగాళ్లు గెలుచుకున్నారు.

మీరా భాయ్ చానును చేసి దేశ ప్రజలు గర్విస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న చానూ… తాజాగా జరిగిన పోటీలోనూ విజేతగా నిలిచారు. 2014 కామన్ వెల్త్ గేమ్స్ లోనూ మీరా చాను సిల్వర్ పతకాన్ని సాధించారు. 2017 వరల్డ్ చాంపియన్ షిప్ లోనూ ఆమె బంగారు పతకాన్ని గెలిచారు. ఒలింపిక్ లో మీరా సిల్వర్ గెలిచి సత్తా చాటారు.

మహిళల 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి సిల్వర్ మెడల్ సాధించింది. ఇప్పటికే సాకేత్ సర్గర్ సిల్వర్ పతకం గెలవగా… గురుజా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఇక కామన్ వెల్త్ గేమ్స్ లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇంగ్లాండ్ దూసుకుపోతున్నాయ్.