ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కోసం బాహాబాహీ
తెలంగాణ బీజెపి,కాంగ్రెస్ నాయకులు పరస్పరం బాహాబాహీకి దిగారు.మామునూరు ఎయిర్ పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదంటూ పాలాభిషేకం చేసుకునే విషయంలో ఘర్షణకు దిగారు.ఎయిర్ పోర్ట్ నిర్మాణ ప్రాంతంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు చేరుకుని మోదీకి,రేవంత్‌కి పాలాభిషేకం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.ఈ తరుణంలో మాటా మాటా పెరిగిన ఘర్షణకు దారితీసింది.దాంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధి చెప్పారు.అనంతరం సీఎం రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు, మోదీ చిత్రపటానికి బీజెపి శ్రేణులు పాలాభిషేకం చేశాయి.