Breaking Newshome page sliderHome Page SliderTelangana

‘ఐబొమ్మ’ రవి వెనుక ఉన్నది ఎవరు ?

తెలుగు సినిమా రంగాన్ని గడగడలాడించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ పైరసీ నెట్‌వర్క్ అంతర్జాతీయ స్థాయికి విస్తరించినట్లు నిజాలు బయటకు వస్తున్నాయి . ముఖ్యంగా ‘ప్రహ్లాద్’ అనే పేరు చుట్టూ ఈ మిస్టరీ తిరుగుతోంది. రవి తన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా, కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ , నేవిస్ దేశ పౌరసత్వాన్ని కూడా ప్రహ్లాద్ పేరుతోనే పొందడం గమనార్హం. విచారణలో రవి ఈ వ్యక్తి గురించి పొంతన లేని సమాధానాలు ఇస్తూ పోలీసులను అయోమయానికి గురిచేస్తున్నాడు. మరోవైపు, రవికి చిన్ననాటి స్నేహితుడైన విశాఖపట్నంకు చెందిన ప్రసాద్, థియేటర్లలోని హెచ్‌డీ సినిమాలను పైరసీ చేయడం మరియు వెబ్‌సైట్ నిర్వహణలో ఉన్న సాంకేతిక రహస్యాలను పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని 12 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించడంతో, ఈ పైరసీ ముఠా వెనుక ఉన్న మరిన్ని కీలక పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.