ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ జీతం ఎంతంటే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాకుండా జనసేన పార్టీ పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాలు,2 పార్లమెంటు స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేటును సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించింది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ఎమ్మెల్యేల జీతం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేల నెల జీతం రూ.3,35,000/- గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గ అలవెన్స్‌లతో పాటు ఇతర అలవెన్సులను కూడా అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే జీతంగా తీసుకోనున్నారు.

