Home Page SliderNational

“లియో” సెకండాఫ్ విమర్శలపై దర్శకుడు కీలక వ్యాఖ్యలు

Share with

లోకేష్ కనగరాజ్  “ఖైదీ”,”విక్రమ్” సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే ఇటీవల కనగరాజ్, తమిళ దళపతి విజయ్‌‌ కాంబినేషన్‌లో “లియో” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన “లియో” సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కాగా ఈ సినిమా సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉండడం వల్లే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయిందని పలువురు విమర్శించారు. అయితే దీనిపై లియో సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. కాగా ఆయన దర్శకత్వం వహించిన కొత్త సినిమా “ఫైట్‌క్లబ్” ప్రమోషన్స్‌లో దీనిపై లోకేష్ కనగరాజ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా విడుదల తేదిపై ఉండే ఒత్తిడి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.లియో సినిమా సెకండాఫ్ బాగోలేదని చాలామంది విమర్శించారు. ఈ విమర్శలను నేను స్వీకరిస్తున్నా అన్నారు. ఇకపై ఏదైనా సినిమా ప్రారంభం కాగానే దాని విడుదల తేదీని మాత్రం ముందే ప్రకటించనని తెలిపారు. ఎందుకంటే విడుదల తేదిని ముందే ప్రకటించడం వల్ల సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని ఒత్తిడికి గురవుతున్నామన్నారు. అందువల్లే సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను సరిగ్గా పట్టించుకోవడానికి అవకాశముండట్లేదని లోకేష్ కనగరాజ్ స్పష్టం చేశారు. మాస్టర్ సినిమా తర్వాత విజయ్-కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా లియో.ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటించారు.