పాపం.. వధువుకు మేకప్‌తో వివాహానికి పేకప్
పెళ్లికి అందంగా ఉండాలని పెళ్లికూతురు కోరుకోవడం సాధారణమే. దానికోసం పెళ్లిముస్తాబు కోసం బ్యూటీపార్లర్‌ను ఆశ్రయించి చక్కగా తయారవుతూ ఉంటారు. అలాగే కర్ణాటకలోని హసన్ జిల్లా అరసికరె అనే గ్రామానికి చెందిన ఓ పెళ్లికూతురు పెళ్లికి ముస్తాబవడానికి స్థానిక బ్యూటీపార్లర్‌లో మేకప్ కోసం వెళ్లింది. అయితే కొత్త మేకప్ వేస్తానని బ్యూటీషియన్ ముఖానికి ఫౌండేషన్ రాసి ఆవిరి పట్టించింది. వేడి ఎక్కువైందేమో ముఖమంతా కాలి బొబ్బలెక్కింది. దానికి తోడు ఫౌండేషన్‌లో కెమికల్స్ వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెకు అలెర్జీ వచ్చి ఉండవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. వివాహం వాయిదా వేసుకున్న పెళ్లివారు, అనంతరం వధువు ముఖం గురించి తెలుసుకుని ఏకంగా పెళ్లి రద్ధు చేసుకున్నారు. దీనితో కుటుంబసభ్యుల కంప్లైంటుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యూటీషియన్‌ను విచారిస్తున్నారు. కాస్మొటిక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటి మార్గదర్శకాలను పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

