పోలీసులపై ఎన్.హెచ్.ఆర్.సి.కి ఫిర్యాదు చేస్తాం
ఇచ్చిన హామీలను నెరవేర్చాని శాంతియుతంగా నిరశన వ్యక్తం చేస్తున్న ఆశావర్కర్లపై పోలీసులు దమనకాండ సాగించారని మాజీ మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదని,దాని కోసం పోలీసులు ఇంతలా వేధిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేటిఆర్ మంగళవారం పరామర్శించారు.పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఏడాది పాలన అంటూ సభలు పెట్టి ఊదరగొడుతున్నారని, ఒక్కటంటే ఒక్క హామీయైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.పోలీసుల దౌర్జన్యాలపై మానవహక్కుల కమీషన్,మహిళా కమీషన్‌కి ఫిర్యాదు చేస్తామని అందరినీ కమీషన్ ముందు నిలబెడతామని హెచ్చరించారు.