చిన్నారులతో వైభవ్ సూర్యవంశీ ‘ప్రాంక్’
ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 15 ఏళ్ల వయస్సున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, మైదానం బయట కూడా తన సరదా ప్రవర్తనతో అభిమానుల మనసు గెలుచుకుంటున్నాడు. తాజాగా తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో వైభవ్ చేసిన ‘ప్రాంక్’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు ఛత్తీస్‌గఢ్ చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో వైభవ్ సూర్యవంశీని చూసేందుకు ఇద్దరు చిన్నారులు ఉత్సాహంగా వచ్చారు. వారిని ఆటపట్టించాలని నిర్ణయించుకున్న వైభవ్.. తనతో ఫొటో దిగాలంటే డబ్బులు ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. “బ్రదర్.. నేను ఫొటో ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. ఒక్కో ఫొటోకు రూ.100 తీసుకుంటా. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి.” వైభవ్ సీరియస్‌గా చెబుతున్నాడని నమ్మిన ఒక పిల్లాడు.. అమాయకంగా తన దగ్గర రూ. 200 ఉన్నాయని ఆఫర్ చేశాడు. చిన్నారుల స్పందనకు నవ్వేసిన వైభవ్.. అదంతా సరదాకేనని చెప్పి, వారితో ఎంతో ఓపికగా ఫొటోలు దిగి పంపాడు. రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “చిన్న వయసులోనే టాప్ బౌలర్లను ఎదుర్కోవడమే కాదు, అభిమానులను అలరించడంలోనూ వైభవ్ ట్రెండ్ సెట్టర్” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

