Home Page SliderSportsTrending Today

RCB కప్ గెలిచేవరకూ..పెళ్లి చేసుకోదంట..!

Share with

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకంటే భారతదేశంలో ఉన్న క్రికెట్‌ అభిమానులకు క్రికెట్ అంటే పిచ్చి అనే చెప్పాలి. ఎంతలా అంటే ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వీరు క్రికెట్‌ను ఆరాధిస్తారు. ఆటంటే అంత పిచ్చి ఉన్నవాళ్లు మరి ఆట ఆడేవారిని ఎంతలా అభిమానిస్తారో చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం దేశమంతా IPL మేనియా నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలో నిండిపోతున్నారు. IPL లో అన్నీ జట్టులకంటే RCB జట్టుకి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. అయితే వారు ప్రతి IPL సీజన్‌లో సందడి చేస్తూ.. మా టీమే గెలుపొందాలని ఆశిస్తారు. అంతేకాకుండా “ఈసారి కప్ మనదే” అంటూ పెట్టే పోస్ట్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతూ ఉంటాయి. కాగా మొన్న RCB మ్యాచ్ గెలుపొందడంతో కొంతమంది లేడి ఫ్యాన్స్ బోరున ఏడ్చేశారు. దీంతో ఆ వీడియోలు కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే తాజాగా ఓ యువతి RCB కప్ కొట్టేవరకు పెళ్లి చేసుకోనని ప్లకార్డుతో స్టేడియంలో నిల్చొనివున్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసినవారంతా మరి ఈ సీజన్‌లో అయినా ఆమె పెళ్లి జరుగుతుందా?అని కామెంట్స్ చేస్తున్నారు.