Home Page SliderInternational

కొవిడ్ కంటే పెద్ద మహమ్మారి ఈ వైరస్

Share with

కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం మరిచిపోక ముందే మరో వైరస్ దాడి చేస్తోంది. కొవిడ్ కంటే 100 రెట్లు  ప్రమాదకరంగా మారిన ఈ బర్డ్‌ఫ్లూ విస్తరించే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బర్డ్‌ఫ్లూ వేరియంట్ H5N1 అనే వైరస్ టెక్సాస్ లోని ఒక కార్మికుడికి సోకిందని నిర్థారణ అయ్యింది. దీనితో అతనికి అనారోగ్యంతో కళ్లు ఎర్రగా మారిపోయాయి. ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. అతడిని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తి చెందితే మరణాల రేటు విపరీతంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.