NewsTrending Today

కావాలని ట్రోల్ చేస్తున్నారు. అందుకే పట్టించుకోనంటున్న ప్రభాస్ డైరెక్టర్

Share with

ప్రభాస్, కృతి సనన్ జంటగా వచ్చిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం జయాపజయాలు పక్కన పెడితే దీని మీద చాలానే ట్రోల్స్ వచ్చాయి. సినిమా మొదటి రోజునే కొందరు ఆదిపురుష్ డిజాస్టర్ ట్రోల్స్ చేసారు. దీనిపై ఆ చిత్ర డైరెక్టరు ఓం రౌత్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “కొందరు కావాలని చేస్తోన్న ట్రోల్స్ పట్టించుకోవసరం లేదు. ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. మొదటి రోజే రూ. 70+ కోట్లు రాగా, మొత్తంగా రూ. 400+ కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 200+ కోట్లు వచ్చాయి. ఓ సినిమాకు కావాల్సింది బాక్సాఫీస్ వద్ద విజయం మాత్రమే” అని చెప్పుకొచ్చారు.