ప్రజాకవికి నివాళులర్పించిన స్పీకర్
ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్ లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్, TMREIS ప్రెసిడెంట్ & వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు తదితరులు కూడా నివాళులర్పించారు.

