వామ్మో ఆ దేశంలో మాంసం ఫ్రీ.. ఎంతంటే!?
ఆఫ్రికాలోని నమీబియాలో చాలా తీవ్రమైన కరువు నెలకొంది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు. పస్తులుంటున్నారు. అనేక మంది ఆకలి చావులు చస్తున్నారు. ప్రజలు కండ్ల ముందు పిట్టల్లా రాలుతుంటే సర్కారుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సుమారుగా నమీబియాలో 14 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వ అంచనాలున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి అరుదైన జంతువులలో 723 రకాల అడవి జంతువులను చంపి వాటి మాంసాన్ని అక్కడి ప్రజలకు అందించాలని భావిస్తోంది. 30 రకాల నీటిగుర్రాలు, 50 రకాల ఇంఫాలాలు, 60 రకాల అడవి దున్నలు, 83 రకాల ఏనుగులు, 100 రకాల బబ్లూవైల్డ్ బీస్ట్ లు, 300 రకాల జీబ్రాలు మాంసాన్ని ప్రజలకు పంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.