ఏపీ అసెంబ్లీలో టీడీపీ తొలి గెలుపు
ఏపీ ఎన్నికలలో టీడీపీ పార్టీ తన తొలి ఖాతాను తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయాన్ని సాధించారు. ఆయనకు ఈ స్థానంలో 50 వేల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీద విజయం సాధించారు. ఎన్డీయే కూటమి 160 సీట్లలో ఆధిక్యతలో కొనసాగుతోంది. దీనితో ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబునాయుడు తన మాట నిలబెట్టుకుంటున్నారని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

