చక్కటి సంతానానికి సూపర్ ఫుడ్స్
ఇటీవల కాలంలో చాలామంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూంటారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే సంతానలేమి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు పద్దతి ప్రకారం తీసుకుంటే చక్కటి సంతానసాఫల్యానికి తోర్పడతాయని సలహా ఇస్తున్నారు.
. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గి, పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ “బి”, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ “సి” సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్ “సి” పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు డాక్టర్లు.
. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సంతానోత్పత్తిని మెరుగుపడాలంటే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
. బీన్స్ జాతికి చెందిన కూరలలో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది.
. అరటిపళ్లలో పొటాషియం,విటమిన్” B6″ ఇందులో తగినంత పరిమాణంలో ఉంటాయి. సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది.