మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు: మంత్రి జూపల్లి
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా వదిపెట్టమని కేసు పెడతామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆయన పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. బాధితురాలిని, ఆమె భర్తను జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు వ్యవసాయం చేసుకోడానికి ప్రభుత్వపరంగా కొంత భూమిని అందిస్తాం. వారి పిల్లలకు ప్రభుత్వ పరంగా విద్యను అందించే విధంగా చర్యలు చేపడతాం అని జూపల్లి కృష్ణారావు తెలిపారు.

