Home Page SliderNational

“డ్రగ్స్‌కు నో చెప్పండి”: భారతీయుడు-2 టీమ్

కమల్ హసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “భారతీయుడు-“2. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సైబర్ క్రైమ్,డ్రగ్స్ నియంత్రణలో సినీ ఇండస్ట్రీ భాగమవ్వాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సైబర్ క్రైమ్,డ్రగ్స్ నియంత్రణలో భాగమయ్యేందుకు “భారతీయుడు-2” టీమ్ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా సినిమా డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్‌తోపాటు ఇందులో కీలక పాత్రలు పోషించిన సిద్ధార్థ్,సముద్రఖని డ్రగ్స్‌కు నో చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. “మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి డ్రగ్స్‌కు నో చెప్పండి” అని కమల్ హాసన్ తెలిపారు. కాగా డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన తెలంగాణా ప్రభుత్వానికి కమల్ అభినందనలు తెలియజేశారు.