Home Page SliderTelangana

“10 ఏళ్లల్లో కేసీఆర్ చేయలేనిది రేవంత్ రెడ్డి చేశారు”:జగ్గారెడ్డి

తెలంగాణా బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ది ప్రజల బడ్జెట్,అభివృద్ది బడ్జెట్ అని ఆయన కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సోనియా,రాహుల్ గాంధీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారన్నారు. అందుకే ఆయన రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 10వేల కోట్లు హైదరాబాద్‌కు కేటాయించారన్నారు. అయితే గత 10 ఏళ్లల్లో కేసీఆర్ హైదరాబాద్‌కు నిధులు కేటాయించలేదని ఆయన ఆరోపించారు.కాగా పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను కేసీఆర్ స్వాగతిస్తే బాగుండేదని జగ్గారెడ్డి తెలిపారు.