Home Page SliderTelangana

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

Share with

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్ లో రెండు ఎఫ్ఐఆర్ లను కోర్టు కొట్టేసింది. లగచర్ల దాడి ఘటనలో బొంరాస్ పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఒకే ఘటనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని వాదించారు. ఒకే ఘటనపై వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోలీసుల తరపున ఏఏజీ రజనీకాంత్ వాదన వినిపిస్తూ లగచర్లలో జరిగిన దాడి ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 25న తీర్పును రిజర్వ్ చేసింది.