Home Page SliderNational

వికీపీడియాకు నోటీసులు

వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెబ్ సైట్ లో తప్పులు ఉన్నాయని అందిన ఫిర్యాదుల మేరకు నోటీసులు పంపింది. వికీపీడియాని పబ్లిషర్ గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్ ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీపీడియా గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్ తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. అయితే పక్షపాతంగా సమాచారం ఉంటుందని పలువురు కంప్లైంట్ చేయటంతో కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే.. ఈ సంస్థ దేశానికి వ్యతిరేకంగా సమాచారాన్ని పొందుపరిచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కూడా గతంలో పలు జాతీయవాద సంఘాలు ఆరోపించాయి.