Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

పనామా కూడలి వద్ద హత్య కలకలం

హైదరాబాద్ (ఏడీఎన్ఎన్) – హైదరాబాద్‌లోని వనస్థలిపురం పనామా కూడలి సమీపంలో ఆదివారం ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఉదయం రోడ్డు పక్కన రక్తపు మడుగులో మృతదేహం కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు గుర్తించారు. మృతుడి శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. అయితే మృతుడు ఎవరు, హత్యకు గల కారణాలేమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.