Breaking NewsHome Page SliderInternationalNewsNews AlertTrending Today

బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణం: హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రానున్న డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లి అక్కడి కోర్టుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న ఆమె, ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తనను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హసీనా తెలిపారు. తనతో పాటు అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు కూడా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు చెప్పారు.

స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని అంగీకరించిన హసీనా, “బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టగానే నన్ను అరెస్టు చేయొచ్చు.. లేదా చంపేయొచ్చు. అయినా నేను వెళ్లడానికి సిద్ధమే. నా పార్టీ నేతలు, కార్యకర్తలు అణచివేతను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ మరణం సంభవిస్తే నా తల్లిదండ్రులు సమాధి చేసిన చోట నా స్వదేశంలోనే చివరి శ్వాస విడవాలనుకుంటున్నాను” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. అయితే స్వదేశానికి తిరుగు ప్రయాణంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని ఆమె స్పష్టం చేశారు.

2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక నిరసనల అనంతరం షేక్ హసీనా పదవి కోల్పోయి భారత్‌కు వచ్చారు. ఆ నిరసనలను అణచివేసే క్రమంలో తీవ్ర చర్యలకు ఆదేశాలిచ్చారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ 2025లో ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హసీనా ఖండిస్తున్నారు. ఇదిలా ఉండగా, హసీనా స్వచ్ఛందంగా బంగ్లాదేశ్‌కు వెళ్లి న్యాయస్థానాన్ని ఎదుర్కొంటానని ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.