Home Page SliderTelangana

ఉప్పల్‌లో స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి KTR

హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్ రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్కైవాక్‌ను రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌లో మరో మణిహారం ఆవిష్కృతమైనట్లైంది. కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి,బీఆర్ఎస్ నేతలు,అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో అక్కడ ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. కాగా ఈ స్కైవాక్‌తో పాదచారులకు మేలు జరగబోతుంది. ఇప్పటివరకు ఉప్పల్‌లో ఉన్న ట్రాఫిక్‌తో రోడ్డు దాటడానికి పాదచారులు తీవ్రంగా ఇబ్బందుల పడ్డారు. అయితే ఇది గమనించిన తెలంగాణా ప్రభుత్వం రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను నిర్మించింది. దీంతో పాదచారులు ఇకపై ఎంతో సులభంగా ఉప్పల్ క్రాస్ రోడ్స్‌ను దాటవచ్చు. అంతేకాకుండా మెట్రో స్టేషన్ ప్రాంతానికి వెళ్లేందుకు, ఉప్పల్‌లోని అన్ని బస్టాప్‌లకు వెళ్లేందుకు వీలుగా ఈ స్కైవాక్‌ను నిర్మించారు.