ఐఎస్ సదన్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైద్రాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.పాతబస్తీలోని మాదన్నపేట చౌరాస్తాలో ఉన్న ఓ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడటంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.మంటలను పూర్తిగా నిలురించేందుకు ప్రయత్నించారు.ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ తలుపులు మూసే ఉన్నాయి.లోపల కార్మికులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.టెక్నికల్ సిబ్బంది రంగ ప్రవేశం చేసి గ్యాస్ కట్టర్‌ల సాయంతో షట్టర్‌లను కట్ చేశారు.

