బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్
బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేసింది. దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ నేతలారా ఖబడ్డార్ అంటూ హెచ్చరించింది. దళిత బంధు ఇప్పిస్తామని అమాయక ప్రజల నుంచి లక్షలు వసూలు చేశారని.. ఇప్పటికైనా వసూలు చేసిన
డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరులో లేఖ విడుదలైంది.