Home Page SliderNationalPolitics

లోక్‌సభలో భాషా చిచ్చు..డీఎంకే బీజేపీ వాగ్వాదం

లోక్‌సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానానికి తమిళనాడు డీఎంకే పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఆందోళన చేస్తూ డీఎంకే ఎంపీలు గందరగోళం సృష్టించారు. వీరి చర్యలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. జాతీయ విద్యావిధానంపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. డీఎంకే పార్టీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందన్నారు. వారికి నిజాయితీ లేదని, భాషా పరమైన వివాదాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజాస్వామ్య వ్యతిరేక వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. దీనితో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.