జగన్ సెక్యూరిటీ పెంపుపై హైకోర్టులో కీలక వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ సెక్యూరిటీ పెంపుపై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని భద్రతా సిబ్బందిగా ఇచ్చారో అంతమందిని మళ్లీ నియమించాలంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి కౌంటర్ వేసిన రాష్ట్రస్థాయి భద్రతా రివ్యూ కమిటీ సభ్యులు, ఐపీఎస్ విశ్వనాథ్ ఇప్పటికే 58 మంది సిబ్బంది జగన్‌కు రక్షణగా ఉన్నారని పేర్కొన్నారు. తనకు ముప్పు ఉన్నట్లు అధికారులకు జగన్ ఎలాంటి ఆధారాలనూ ఇవ్వలేదన్నారు. సాధారణంగా మాజీ ముఖ్యమంత్రులకు వై కేటగిరీ సెక్యూరిటీ మాత్రమే ఇస్తారు. కానీ భద్రతా ముప్పు విశ్లేషణ ఆధారంగా జగన్‌కు జడ్‌ప్లస్ కేటగిరీ రక్షణము కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనితో పాటు బుల్లెట్ రెసిస్టెంట్ రక్షణ కూడా జగన్‌కు కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడు షిఫ్టులలో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు ఎల్లవేళలా ఉంటారని పేర్కొన్నారు. దీనిపై తిరిగి కౌంటర్ రిప్లై వేసేందుకు జగన్ న్యాయవాదికి ఈ నెల 13 వరకూ కేసును వాయిదా వేశారు.

