Home Page SliderTelangana

కమలాపూర్: లక్ష్మీపురం ఎన్నికల ప్రచారంలో ఈటల జమున రాజేందర్

Share with

కమలాపూర్ మండలంలోని, లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున రాజేందర్ గారు

కామెంట్స్…. : ✍️ ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైంది

✍️ నేను ఇంటింటికి వెళ్లినప్పుడు యువకులకు ఉద్యోగాలు లేక కన్నీరు పెడుతున్న తల్లిదండ్రులు

✍️ BRS కండువా వేసుకో నీకు పింఛన్ ఇస్తా, దళిత బంధు, నీకు బీసీ బంధు ఇస్తా.. కేసీఆర్ ఇంట్లోంచి ఏమీ తెచ్చి ఇస్తలేడు కదా

✍️ 24 గంటలు అందుబాటులో వుండే వ్యక్తి మీ ఈటలన్న

✍️ కమలాపూర్‌లో స్కూల్స్ కట్టించింది మీ ఈటలన్న కాదా

✍️ మీ ఊర్లో రోడ్లు వేసింది మీ ఈటెలన్న కాదా

✍️ ఇప్పుడు వస్తున్న BRS, కాంగ్రెస్ నాయకులు ఈ పది రోజులు మాత్రమే కనబడతారు

✍️ మన మానేరు ఇసుక అమ్మిన డబ్బులు, భూములు అమ్మిన పైసలు పట్టుకొని వస్తారు అవి మన పైసలే కాబట్టి తీసుకోవాలె, ఓటు వేసే దిక్కు వేసుకోవాలి

✍️ మీ ఈటలన్నకు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత అప్పజెప్పింది కాబట్టే రాలేకపోయారు

✍️ బీజేపీ వస్తే సొంత జాగా వున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇచ్చే బాధ్యత బీజేపీ ప్రభుత్వందే

✍️ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మీ ఈటెలన్నకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించి మీరు అనుకున్న పదవిలో కూచోబెడతారని ఆశిస్తున్నా.. నమస్కారం…