పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి వేదికగా ఇండియా వార్నింగ్
పాకిస్తాన్‌కు ఇండియా ఘాటు రిప్లై
తీవ్రవాదానికి అడ్డా పాకిస్తాన్ అంటూ ధ్వజం
ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చారుగా…
భారత పార్లమెంట్‌పై దాడి మరచిపోయారా?
సీమాంతర ఉగ్రవాదంతో రెచ్చిపోతున్నారుగా?
ఐక్యరాజ్యసమితిలో నీతులు చెబుతారా?
UN భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత, పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన మీరు, పొరుగు దేశం పార్లమెంట్ దాడి చేసిన మీరా ఇండియాకు నీతులు చెప్పేదంటూ మండిపడింది. ఐక్యరాజ్యసమితిలో మరో దేశం గురించి మాట్లాడేందుకు ఎలాంటి అర్హత పాకిస్తాన్‌కు అసలే లేదంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి విచక్షణతో కూడిన బహుళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా లాంటి మహమ్మారి అంశం కానివ్వండి, వాతావరణంలో మార్పు కానివ్వండి, ఉగ్రవాదం అంశం కానివ్వండి… వీటన్నింటిపైనా సమర్థవంతమైన ప్రతిస్పందన ద్వారానే ఐక్యరాజ్యసమితి విశ్వసనీయత ఆధారపడి ఉందన్నారు. బహుళపాక్ష సంస్కరణలపై ఇండియా కోరుకుంటుందన్నారు. అందుకు మొదట్నుంచి ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలకు పట్టుబడుతున్నామని చెప్పారు.

ఉత్తమ పరిష్కారాల కోసం ఇండియా ప్రయత్నిస్తున్నప్పుడు… వాటిని అంగీకరించకూడనిది, బెదిరింపులకు దిగడం హేయమన్నారు జైశంకర్. ప్రపంచం ఆమోదయోగ్యం కానిదిగా భావించే వాటిని సమర్థించే ప్రశ్న కూడా ఏ దేశం కూడా చేయకూడదన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి, పొరుగు దేశం సీమాంతర ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమివ్వడం, భారత పార్లమెంటుపై దాడి ఘటనలకు సాయం చేయడం గురించి ఒక్కసారి పాకిస్తాన్ ఆలోచించుకుంటే మంచిదన్నారు. పద్దెనిమిదేళ్ల క్రితం డిసెంబర్ 13న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాదులు న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌పై దాడి చేసి కాల్పులు జరిపి తొమ్మిది మందిని హతమార్చిందన్నారు. ఐక్యరాజ్యసమితి చర్చలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం ప్రస్తుత ప్రెసిడెన్సీలో జరుగుతున్న ఉగ్రవాద నిరోధకం, సంస్కరించబడిన ఐక్యరాజ్యసమితి స్పందన కీలకమన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. కౌన్సిల్లో భుట్టో మాట్లాడినప్పుడు UNలో భారతదేశ శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ చర్చకు అధ్యక్షత వహించారు. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని న్యూఢిల్లీ రద్దు చేసినప్పటి నుండి ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశం నిర్ణయం పాకిస్తాన్ నుండి బలమైన ప్రతిచర్యలను రేకెత్తించింది. దౌత్య సంబంధాలను తగ్గించి, భారత రాయబారిని బహిష్కరించే వరకు వెళ్లింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం తమ అంతర్గత వ్యవహారమని భారత్ అంతర్జాతీయ సమాజానికి స్పష్టంగా చెప్పింది. వాస్తవాన్ని అంగీకరించాలని, భారత వ్యతిరేక ప్రచారాలన్నింటినీ ఆపాలని పాకిస్థాన్‌కు సూచించింది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో ఇస్లామాబాద్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ పాకిస్థాన్‌కు తెలిపింది.

