పాక్‌పై భారత్ కీలక నిర్ణయాలు
పహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉందని తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. దీనితో పాకిస్తాన్‌పై కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేయాలనే నిర్ణయానికి భారత ప్రభుత్వం వచ్చింది. వాటిలో కొన్ని కఠిన నిబంధనలు కూడా అమలు చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. వాటిలో ముఖ్యమైనవి..పాకిస్తానీయులకు భారత్‌లోకి నో ఎంట్రీ, అటారి-వాఘా చెక్‌పోస్ట్ మూసివేత, ఇకపై వీసాలు కూడా జారీ చేసేది లేదు. అలాగే పాక్ పర్యాటకులు, పౌరులు 48 గంటల్లో భారత్ వీడాలని ఆదేశించారు. గతంలో ఏర్పాటు చేసుకున్న సింధు జలాల ఒప్పందం నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. దారుణమైన ఈ ఉగ్రదాడిలో 25 మంది భారతీయులతో పాటు ఒక నేపాలీ కూడా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో భారత్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.

