అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు అన్ని వేల కోట్లా..?
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ తన తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహాన్ని “నభూతో నభవిష్యతి” అన్నట్లుగా ఎంతో ఘనంగా చేస్తున్నారు.కాగా నేడు ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు ఎంత అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.అయితే గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో ప్రపంచంలోని టాప్ సింగర్లు,సెలబ్రిటీలు పాల్గొన్నారు.ఈ రోజు వివాహం చేసుకోబోతున్న అనంత్-రాధికాను ఆశీర్వదించేందుకు సినీ,రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. ఈ క్రమంలో అనంత్ అంబానీ పెళ్లి ఖర్చుపై ఫోర్బ్స్ పత్రిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాగా అనంత్ అంబానీ పెళ్లికి ముకేశ్ అంబానీ రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. అయితే ఇది అంబానీ నికర విలువలో 0.5% మాత్రమే అని ఫోర్బ్స్ తెలిపింది.

