సొమ్ము మాది.. షోకు మీద..
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కేంద్రం నిధుల ఇస్తే.. పేరు ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టడం సరికాదని మెదక్ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మకమిటీల పేరుతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సరికాదన్నారు. బీజేపీని భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీలకు చట్టబద్ధత లేదన్నారు. ఇందిరమ్మ కమిటీలు పెట్టి లబ్దిదారులను ఎంపిక చేస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై హైకోర్టుకు వెళ్తామన్నారు. గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలి. గ్రామ పంచాయితీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకోవాలనుకుంటున్నారని రఘునందన్ తెలిపారు.