Andhra PradeshHome Page Slider

నాకీ రాజకీయాలొద్దు…ఆర్జీవీ

Share with

ఇకపై రాజకీయాలపై సినిమాలు చేయనంటూ మాట ఇచ్చారు సంచలన దర్శకుడు ఆర్జీవీ. ఈమధ్యనే వ్యూహం, శపథం సినిమాలతో చేతులు కాల్చుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రాలు ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడు.  ఇకపై రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రాలకు దూరంగా ఉంటానని, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తానని ప్రకటించాడు. దీనికోసం యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్ట్‌ను ప్రారంభించారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ప్రతీ విభాగంలోనూ బెస్ట్ టాలెంట్‌ను గుర్తిస్తామని, అలా ఒక బెస్ట్ టీమ్‌ను తయారు చేసి వారితో సినిమా తీస్తానని పేర్కొన్నాడు. క్రౌడ్ ఫండింగ్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనితో ఆయనకు బుద్ది వచ్చిందంటూ విమర్శకులు కామెంట్లు పెడుతున్నారు.