Andhra PradeshHome Page Slider

హిందూపురం గడ్డ మార్పు కోరుకుంటోంది.. ఖాయమవుతున్న గెలుపు!?

Share with

నమ్మకం అమ్మకమవుతుంది. నిజం అబద్ధమవుతుంది. అసత్యం సత్యమంటూ రంకెలు వేస్తోంది. సమర్థత, అసమర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో ఆదిపురుషులు అవతరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకు వచ్చారు. ఆధ్యాత్మికవేత్త, శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద. హిందూపురం ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చేందుకు మానవ రూపంలో అడుగుపెట్టి… ఇప్పుడు ఎన్నికల సంగ్రామంలో దుమికారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు స్వామి పరిపూర్ణానంద ప్రజలతో అనునిత్యం మమేకమవుతూ.. వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ప్రజలకిచ్చిన హామీ మేరకు ఎన్నికల బరిలో దిగి, వారితో కలిసి పనిచేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందూపురానికి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం అన్న భావనను కలిగించి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానంటున్నారు స్వామి పరిపూర్ణానంద. ఇప్పటి వరకు ఓటుకు నోటు ఇస్తున్న పార్టీలకు భిన్నంగా తాను అధికారంలోకి వస్తే హిందూపురం ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తానో వివరించి చెబుతున్నారు. స్థానికంగా బలంగా ఉన్న బీసీ వర్గాలను అక్కున చేర్చుకుంటానంటూ, తనది నిరుపేద కులాల గొంతుకంటూ భరోసాస్తున్నారు. సోలార్ విద్యుత్ ద్వారా హిందూపురం ప్రజలకు ఉచిత విద్యుత్ అందించడంతోపాటుగా, ఏడాదికి లక్ష రూపాయల బెనిఫిట్ కలిగించేలా కార్యాచరణతో అడుగులు వేస్తున్నారు. అంతే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలను హిందూపురం కేంద్రంగా తీసుకువచ్చి
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటున్నారు.

రాజకీయంగా తనను అంతమొందించాలని కుట్రలు చేసిన అన్ని పార్టీలకు తానేంటో చూపించాలని కసిగా ఉన్నారు స్వామి పరిపూర్ణానంద. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బడుగు బలహీన వర్గాలకు తానే ఆశాజ్యోతి అవ్వాలని ఆయన సంకల్పం తీసుకున్నారు. ఇప్పటికే హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కలియతిరిగిన స్వామీజీ ముఖ్యంగా అక్కడి సామాజిక వర్గాలైన బీసీ వర్గాల అండగా ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్ళుగా తాము మోసపోయామని ఇప్పుడు కూడా మోసపోతే తమను రక్షించే వారు ఎవరు ఉన్నారని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అందుకోసమే ఈ ఎన్నికల్లో అగ్గిపెట్టె గుర్తుపై ఓటేసి స్వామి పరిపూర్ణానందను అఖండ మెజారిటీతో గెలిపించి తీరుతామంటూ అక్కడి స్థానిక ప్రజలు ప్రతిజ్ఞ చేస్తున్నారు.

హిందూపురం అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి, టిడిపి నేతలు డబ్బులు ఇచ్చినప్పటికీ తాము మాత్రం నోటుకు లొంగిపోమంటూ స్వామీజీ మార్గమే శిరోధార్యమంటున్నారు. అగ్గిపెట్టె గుర్తుకు వేసి స్వామి పరిపూర్ణానందకు అఖండ మెజార్టీ ఇస్తామంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్వామి పరిపూర్ణానందకు విజయం చేకూర్చితే అది దేశంలో రాష్ట్రంలోనే గేమ్ చేజర్ అవుతుందని భవిష్యత్‌లో రాజకీయాలకు ఇది తొలిమెట్టుగా అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వామి పరిపూర్ణానంద తొలుత తన పోటీపై సీరియస్‌‌గా లేకున్నప్పటికీ, బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలు చేసిన ప్రకటనలతో ఎన్నికల బరిలో నిలిచి గెలుపు పై దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో స్వామి పరిపూర్ణానంద అద్భుత విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.