ఉద్రిక్తతకు దారితీస్తున్న గ్రామసభలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రామసభలో అగ్నిగుండంలా మారుతోంది. అన్నీ గ్రామాల్లో నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. పౌర సేవలకు సంబంధించి ఏ ఒక్క పని కూడా జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు.తాజాగా దీనికి సంబందించి సాక్షాత్తు ఓ గ్రామ సర్పంచ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం రేకెత్తించింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.అతడిని వారించేందుకు పోలీసులు,అధికారులు,సిబ్బంది,గ్రామస్థులు అంతా పరుగులు తీశారు.అయినా చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకుని ఒంటిపై నీళ్లు చల్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇదిలా ఉండగా … గ్రామసభల్లో చదువుతున్న వారి పేర్లు కేవలం దరఖాస్తు చేసుకున్నవే అని అంతే తప్ప అర్హుల జాబితా కాదంటూ డిసీఎం భట్టి బాంబు పేల్చడంతో ప్రజల ఆగ్రహజ్వాలలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి.

