ఏపీలో కులగణన చేపట్టనున్న ప్రభుత్వం
ఇటీవల కాలంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కులగణన చేపట్టడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఉత్తర్ ప్రదేశ్ లాగానే కులగణన చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీలో నవంబర్ 15 నుంచి కులగణన ప్రారంభించనున్నట్లు మంత్రి చెల్లు బోయిన వేణు గోపాల్‌కృష్ట వెల్లడించారు. కాగా రాష్ట్రంలో కులగణనతోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు సరిగ్గా అందుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే కులగణన చేయాలని అనేక సంఘాలు ఉద్యమాలు చేశాయన్నారు. అందుకే కులగణన జరిపిస్తామని సీఎం జగన్ ప్రకటించారన్నారు. దీనిపై అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపించామని ఆయన తెలిపారు. కాగా రాష్ట్రంలో పేదవాడికి ఎప్పుడూ అండగా ఉండాలనేదే సీఎం ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 15కు వారం అటు ఇటుగా కులగణన ప్రక్రియ చేపడతామని మంత్రి చెల్లు బోయిన వేణు గోపాల్‌కృష్ట స్పష్టం చేశారు.

