Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

పదో తరగతి ఫలితాలలో అదరగొట్టిన అమ్మాయిలు..

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను కొద్ది సేపటి క్రితం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజా ఫలితాలలో అమ్మాయిలదే పైచేయి అయ్యింది. మొత్తంగా ఈ ఫలితాలలో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. అమ్మాయిలు 84 శాతం ఉత్తీర్ణులు కాగా, అబ్బాయిలు 78 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 17 నుండి మార్చి 31 వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.