కష్టాల్లో ఉన్న రైతులపై భారం వేయొద్దు..
కష్టాల్లో ఉన్న రైతులపై పంటల బీమా ప్రీమియం భారం మోపడం సరికాదని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఐదేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 5.52 కోట్ల ఎకరాలకు, 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించామని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ. 34,288.17 కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసి వారికి వెన్నుదన్నుగా నిలిచామని పేర్కొన్నారు. తక్షణమే ఉచిత పంటల బీమా పథకం రద్దుపై పునరా లోచించాలని, రైతుల తరపున ప్రీమియం ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.