Home Page SliderSports

IPL మ్యాచ్‌లో గాయపడ్డ ధోని

Share with

 ఈ IPL సీజన్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి గాయాలతో ప్లేయర్స్  మ్యాచ్‌కు దూరమవుతూనే ఉన్నారు. కాగా ఇప్పటికే RCB ప్లేయర్ కేన్ విలియమ్స్‌న్ మోకాలి గాయంతో ఈ సీజన్ IPL మ్యాచ్‌కు శాశ్వతంగా దూరమయిన విషయం తెలిసిందే. కేన్‌తో పాటు పలువురు ప్లేయర్స్ కూడా గాయపడి ఆటకు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో CSK టీమ్ కెప్టెన్ ధోని కూడా ఈ IPL మ్యాచ్‌లో  గాయపడినట్లు తెలుస్తోంది.  కాగా ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నారని హెడ్ కోచ్ ఫ్లెమింగ్ వెల్లడించారు.  గాయం కారణంగానే ధోని ఫీల్డ్‌లో పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్నారని హెడ్ కోచ్ పేర్కొన్నారు. అందువల్లే ఆయన 2 పరుగులు తీయాల్సిన సందర్భాల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేయగలుగుతున్నారన్నారు. ప్రస్తుతం ధోనిని మా వైద్యబృందం పర్యవేక్షిస్తుందని హెడ్ కోచ్ తెలిపారు. అయితే తర్వాత జరగబోయే మ్యాచ్‌కు ఓ నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి ధోని ఈ లోపు కోలుకుంటారని ఆశిస్తున్నామన్నారు. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.