డీజీపీ తనయుడు ఆల్‌రౌండర్ చామ మిలింద్
తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ తనయుడు చామ మిలింద్, క్రీడారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని తెలుసా? 31 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, హైదరాబాద్ రంజీ జట్టులో కీలక ఆటగాడిగానే కాకుండా, దేశవాళీ క్రికెట్ లో అత్యంత ప్రభావవంతమైన ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నారు. గతంలో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను చాటారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ డేర్‌డెవిల్స్ వంటి ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు. మిలింద్ మూడు ఫార్మాట్లలోనూ బంతితో, బ్యాట్‌తో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్ చామ మిలింద్ ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు ఆడిన 82 టీ20 మ్యాచ్‌ల్లో 121 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఒకే మ్యాచ్‌లో 8 పరుగులకే 5 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.

